Facebook Twitter
ఆత్మవిశ్వాసం ఆకాశమంత..!

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!

సమస్యల వలయంలో
చిక్కుకొని బిక్కుబిక్కు
మంటూ భయంతో బ్రతకమాక...

నీ చిక్కుసమస్య
నీ కంటే పెద్దది కావొచ్చు
కానీ ఏ జఠిల సమస్యైనా
ఆ దైవంకన్న పెద్దదికాదన్న
"ఆకాశమంత ఆత్మవిశ్వాసాన్ని"
నీ గుండెల నిండుగా నేడే నింపుకో...

ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
విజయమో...
వీరస్వర్గమమో...
నీ "నిత్య నినాదం"...కావాలి

పాతాళంనుండి
పైకి రావడానికి కాదు...
ఎవరెస్టు శిఖరమంత
ఎత్తుకు ఎదగడం...
నీ "ఆఖరి ఆశయం"...కావాలి

విజయం...
నీ కీర్తి కిరీటమైతే...
దాన్ని ధరించడం...
నీ "అంతిమలక్ష్యం"...కావాలి