Facebook Twitter
పక్షి ఇచ్చే పచ్చని సందేశం...?

అనగనగా
ఓ పచ్చని వృక్షం
దాని మీద పకపకమని
నవ్వే ఓ పక్షి కుటుంబం..!

చెట్టు కింద పుట్టలో
బుసలు కొట్టే బద్ధ
శత్రువైన ఓ విషసర్పం..!

వేటగాళ్లొచ్చారు
గండ్రగొడ్డళ్ళకు
పదును పెడుతున్నారు
పాము పుట్టను చీల్చాలని..!
పచ్చని చెట్టును కూల్చాలని..!

ప్రమాదాన్ని
పసిగట్టిన పక్షి
శతృత్వం మరచి
తనకు బద్ధ శత్రువైన
పామును హెచ్చరించే
తక్షణమే పారిపొమ్మని..!

ప్రతి మనిషికి ఈ పక్షి ఇచ్చే
పచ్చని సందేశమొక్కటే..!
పగలు ప్రతీకారాలు వద్దని..!
అసూయా ద్వేషాలు అనర్థమని..!

ప్రతి మనిషిగుండెలో
ప్రేమలతలను పెంచాలని..!
శత్రుత్వాన్ని జయించాలని..!
శత్రువులను సైతం ప్రేమించాలని..!