ఓటమి వెనుకనే విజయం...?
ఓటమి అంటే..?
ఒక తీర్పు కాదు...
ఓటమినెప్పుడూ
ఒప్పుకోవద్దు...
ఓటమి అంటే..?
ఒక ఓర్పు...
ఒక నేర్పు...
ఒక మార్పు...
కాలం...
మంచులా కరిగిపోతుంది
క్షణక్షణం...
ఆయుష్షు తిరిగి పోతుంది
వీరులను...
విజేతలను తప్ప...
పిరికిపందలనెప్పుడూ
విజయం విందుకు పిలువదు...
విజయమెవరికీ బంధువు కాదు...
మూర్ఖుడికెప్పుడు ముక్తి లభించదు...



