Facebook Twitter
కోటీశ్వరుడు కావాలంటే ? (మినీ కవిత)

మన సాగుభూమికి

సరిహద్దులు..పొలం గట్లు

 

మనిషికి ప్రాణవాయువును

అందించేవి...పచ్చని చెట్లు

 

స్వామి అయ్యప్ప దర్శనానికి 

ఎక్కవలసింది...పద్దెనిమిది మెట్లు

 

కోట్లు ఆర్జించాలంటే 

కోటీశ్వరుడు కావాలంటే ?

రాజమార్గమొక్కటే..కొనవలసింది ప్లాట్లు

 

ఔను లడ్లు కావాలంటే... తిరుపతి పోవాలి

లక్షలు కావాలంటే‌... బ్యాంకులో డిపాజిట్ చేయాలి

కోట్లు కావాలంటే రేట్లు పెరగక ముందే ప్లాట్లు కొనాలి