Facebook Twitter
మనిషి...నిన్న...నేడు...రేపు

నిన్న...మనిషి అమ్మగర్భంలో

అంధకారంలో ఉండి !.................

 

పిండమై తిరుగుతూ

రోజురోజుకు పెరుగుతూ

తొమ్మిదినెలలు రాగానే

కమ్మని కలలెన్నో కనే

కన్నతల్లి గర్భం చీల్చుకుని

కెవ్వుమని కేక పెడుతూ

ఏడుస్తూ పుడితే మొదటిసారిగా 

ఆపసికందును కనులారా గాంచిన

ఆ తల్లీదండ్రుల కళ్ళల్లో 

ఉబికేది ఆనందభాష్పాలే  

ఉప్పొంగేది సంతోషపు కెరటాలే

ఆ మధురక్షణంలో ఆ తన్మయత్వంలో

 

నేడు...భూమిపై పుట్టిన ఆమనిషి 

తిరిగి గిట్టే‌వరకు ఏమౌతాడు?.........

 

ఆ అమ్మానాన్నలు 

జన్మనిచ్చినందుకు

ఆ దైవం ప్రాణంపోసినందుకు

జీవితంలో ఒక లక్ష్యంతో

గమ్యం‌ చేరేందుకు 

గట్టిపట్టుదలతో కృషి‌చేసి

మనిషి ఒక మహర్షిగా

ఆదర్శమూర్తిగా

సంఘసంస్కర్తగా

మహనీయునిగా

మహాపురుషునిగా

వీరునిగా శూరునిగా

విక్రమార్కునిగా 

విశ్వవిజేతగా మారిన ఆ మనిషే 

 

రేపు...కన్నుమూస్తే చివరికేమౌతాడు?

మొదట 

కదలనికట్టెగా

పూడిస్తే మట్టిగా

కాలిస్తే బూడిదగా

ఇంటిలో గోడకొక ఫోటోగా

వీధిలో ఒక శిలావిగ్రహంగా

మనిషి మనిషిలో గుండెగుండెలో

మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకంగా

చరిత్రలో చిరంజీవువిగా మిగిలిపోతాడు

ఆకాశంలో ఒక ధృవతారగా వెలిగిపోతాడు