వ్యర్థం వ్యర్థం వ్యర్థం
కదలని బొమ్మకు కవితలు చెప్పడం
గుడ్డివానికి అద్దం చూపడమే
మారని మనిషికి నీతులు చెప్పడం
కుక్కతోక పట్టి గోదారి ఈదడమే
స్పందించన వ్యక్తులకు సందేశాలివ్వడం
మట్టి ఏనుగును నమ్మి నట్టేట్లో దిగడమే
సన్యాసిగా మారినోడికి సలహాలివ్వడం
సిమ్ లేకుండా కాల్ చేయడమే
అన్ని ఒక్కటే వ్యర్థం వ్యర్థం వ్యర్థం



