Facebook Twitter
నిన్న ఆకాశవాణిలో విన్నది

నిన్న ఆకాశవాణిలో విన్నది
కుక్క మనిషిని కరిచిందని...కానీ
నేటి ఈటీవీ "షాకింగ్" న్యూస్
మనిషి...కుక్కను కరిచాడని...

నిన్న ఆకాశవాణిలో విన్నది
పిల్లి ఎలుక పాము కప్పలు
బద్దశత్రువులని...కానీ
నేటి టీవీ9 "బ్రేకింగ్ "న్యూస్
పిల్లి ఎలుక పాము కప్పలేకమై
ఒక కొత్త పార్టీ పెట్టాయని...

నిన్న ఆకాశవాణిలో విన్నది
గడ్డిమేసే గాడిద కోట్లు గడించిందని...
కానీ, నేటి మాటీవీ "షాకింగ్" న్యూస్
ఓండ్రపెట్టి గాడిద అరిచిందట
నా దగ్గరేముంది బూడిదని...

నిన్న ఆకాశవాణిలో విన్నది
"బందిపోట్ల' దాడిలో పోలీసులు
బలయ్యారని... కానీ
నేటి ఎన్ టీవీ "బ్రేకింగ్" న్యూస్
"దొంగనోట్ల" మార్పిడిలో
అధికారులు దొరికిపోయారని...

ఔను "కాలికి ముళ్ళు" గ్రుచ్చుకోవడం
కాదు న్యూస్
"కంటిలో ముళ్ళు" గ్రూచ్చుకోవడమే
"వింత న్యూస్ "
వృక్షానికి "చీడ పట్టడం" కాదు న్యూస్
"విత్తనానికి చీడపట్టడమే" "వింతన్యూస్ "