Facebook Twitter
గుప్పెడు గుండెలో...

గతం తాలూకు
మిగిలిన
తీపిజ్ఞాపకాలు
ఎదురైన
చేదుఅనుభవాలు
తగిలిన విధిదెబ్బలు
పెట్టిన పెడబొబ్బలు
మానని
మదిలో గాయాలు
జీవితంలో
నేర్చుకున్న పాఠాలు
గుండెల్ని
గుచ్చుకున్న
గుణపాఠాలు
వర్తమానానికి
వరాలు కావాలి
రేపటి భవిష్యత్తుకు
గట్టిపునాదులు కావాలి
బంగారుబాటలు వేయాలి
వెన్నెల వెలుగులు తేవాలి
చీకటిలో చిరుదివ్వెలు కావాలి
గుప్పెడుగుండెలో గంపెడు ఆశతీరాలి