స్పందించు స్నేహహస్త మందించు
నేమనిషినే మానును కాను
ఐతే నా మాట తప్పక విను
ఏదైనా ఎప్పుడైనా
వీడియో చూసినప్పుడు
మంచి సందేశం చదివినప్పుడు
మంచి దనిపిస్తే, మనసుకు నచ్చితే
వెంటనే స్పందించు
చిరునవ్వు చిందించు
స్నేహహస్త మందించు
ప్రతివారిని ప్రేమించు
ఆప్యాయంగా పలకరించు
ఆపదలో ఉన్నవారిని ఆదుకో
నేనున్నానన్న భరోసా నివ్వు
నేను మనిషివేనని మంచితనానికి
మానవత్వానికి మారుపేరని
నేను నిప్పులాంటి వాడవని
నీతికి నిజాయితీకి
నిలువుటద్దమని నిరూపించుకో
చేతకానివాడే చేతులు ముడుచుకుంటాడు
మాటరానివాడే మౌనంగా వుంటాడు
ఆడలేనివాడే మద్దెల ఓడంటాడు
అరిచే కాకిని కరిచే కుక్కను
కసురుకుంటారు, కాని
ఆడే నెమలికి పాడే కోకిలకి
ఫ్యాన్స్ వుంటారు
అందుకే సకాలంలో స్పందించనివాడు
కదలని కట్టెతో సమానమంటారు
అవునంటారా? కాదంటారా?
మరి మీరేమంటారు?



