Facebook Twitter
గట్టి దెబ్బ ఒక్కటి తగిలితే చాలు 

ఎవరికి ఎప్పుడూ
ఏమి జరుగుతుందో
ఎవరికి ఎరుక ? 

మన తలరాత బాగోలేక 
మన నవగ్రహాలు అనుకూలించక 
విధి పగబట్టి విషపునవ్వు నవ్వితే 

అకస్మాత్తుగా జరగరాని 
ఘోరమేదైనా జరిగితే చాలు
  
ఒక్కటంటే ఒక్కగట్టి 
దెబ్బ తగిలితే చాలు 

దిమ్మ తిరిగిపోవడానికి 
మైండ్ బ్లాక్ కావడానికి 
కష్టపడి దాచుకున్న డబ్బంతా 
హారతి కర్పూరమైపోవడానికి 

అందుకే ఉండాలి 
ముందుజాగ్రత్త పొదుపు కై
అందుకే ఉండాలి 
ముందుచూపు ఫ్యామిలీ పై

అనవసర ఖర్చుల్ని అదుపు
చేయలేకున్నా పొదుపు చేస్తాననడం

సముద్రంలో అలలు ఆగిన
తర్వాత  స్నానం చేస్తాననడం 

ఇబ్బందులన్నీ తీరిన తర్వాత 
ఇన్సూరెన్స్ చేస్తాననడం

అవివేకం అజ్ఞానం అమాయకత్వం