ప్రియా ఓ నా ప్రియా !
వద్దువద్దు అనకు
ముద్దులతో
నిన్ను ముంచెత్తనియ్...
వెచ్చని వెన్నెల్ని
మనతో ముచ్చటలాడనియ్...
ప్రియా ఓ నా ప్రియా !
శృంగారంలో
శృతిలయల్ని
సంసారంలో
సరిగమల్ని పలకనియ్...
అంబరాన చుక్కల్ని
సంబరాన కులకనియ్...
ప్రియా ఓ నా ప్రియా !
రెక్కలు తెగిన కాలాన్ని
ఒక్క క్షణం ఆగనియ్...
పచ్చని మన కాపురానికి
వేయిపందిళ్ళు వేయనియ్...
ప్రియా ఓ నా ప్రియా !
సదా నీ యెదలో
నన్ను నిదురించనియ్...
తేనెలూరే నీ బిగికౌగిలిలో
నాకు తెలవారనియ్...
ప్రియా ఓ నా ప్రియా !
ప్రేమసాక్షిగా నేడు పెనవేసుకుందాం !
తాళిసాక్షిగా రేపు తల్లిదండ్రులమౌదాం!



