Facebook Twitter
పోలన్న కవి సూక్తి సుధలు

1
ఎవరెస్టు శిఖరం ఎక్కడం
ఎంతో సులభంరా
దూకుడమే శిఖరం నుండి
పరమ దుర్లభమురా
సాధన చేస్తే,సాహసమే ఉంటే
సాధ్యం కానిదేముందిరా ?

2
నావ ఎక్కి నీవు
నడిసంద్రం చేరాక
ఇక తిరిగి చూడకురా
వెనక్కి తీరం చేరేదాకా
గట్టి పట్టుదల ఉన్నవాడే
కదరా గట్టుకు చేరేది

3
ప్రయత్నించగా ప్రయత్నించగా
ప్రతిభ పండురా
తీవ్ర ప్రయత్నంలోనే
తీయని ఫలితం ఉందిరా
కష్టించి పని చేసేవాడే
కదరా కార్యసాధకుండు

4
లాగరా లాగరా
తెగేదాక వస్తే ఆగరా
ఆగరా ఆగరా ఆలోచించి
ముందుకు సాగరా
సాగరా సాగరా
ఆపై విజయామృతాన్ని త్రాగరా