పక్షులు
పక్షులు
చిన్నతనంలో
నన్ను మేల్కొలిపే కిలకిలా రవాలు
లేవిపుడు
ఇంటిలో తనకోగూడును నిర్మించుకుని ఇల్లంతా సందడినింపేవి
తన మిత్రులనపుడపుడు
పిలిపించుకుని
తన ఇంటిని పరిచయం చేసి
అల్లరిగా తిరిగేవి
ఋతువులు మారినపుడల్లా తమకాలానికనుగుణంగా
సుమధురంగా తమ గాత్రాలతో మమ్మల్ని సంతోషంగా లాలించేవి కలివిడితనంతో కలిసిమెలిసి ఉండేవి
అంబరవీదుల్లో సుందరంగా పయనించేవి
ఆ దృశ్యాలు ఎదలో ఇప్పటికి శాశ్వతంగా నిలిచాయి
అనేకానేక
ప్రకృతి రమణీయతలకు
చిరునామా పక్షులు
సాంకేతిక ఆలోచనలిపుడు
కృత్రిమ చెట్లను, పువ్వులను
పక్షులను చూస్తూ
ఆనందించే
నవీన నాగరికత మానవుడు
ఆనాడు ఎన్నో రాగాలు
ఎన్నో అందాలు
ఈనాడు
ఎంత మార్పు
పక్షులు కనరాని ప్రపంచం
భద్రతలేని భవిష్యత్తు
సి. శేఖర్(సియస్సార్)
