ఢిల్లీ సీఎంకు జడ్ కేటగరి భద్రత
posted on Aug 21, 2025 3:19PM

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం (ఆగస్టు 20) జరిగిన దాడిని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండించాయి. నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సీఎంపై ఆమె అధికారిక నివాసంలోనే జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించింది. రేఖాగుప్తాకు జడ్ కేటగరి భద్రత లక్పించాలని నిర్ణయించింది. ఇలా నిర్ణయించడమే తరువాయి, అలా ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో గురువారం ఉదయానికే సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీసుల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి భద్రత బాధ్యతలను స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు.