జగన్ అపాయింట్ మెంట్ కోసం ఎంఎల్ఏల ఎదురు చూపులు


ఏపీలో ప్రభుత్వం ఏర్పడి  సుమారు పది నెలలు దాటిపోయాయి....ఇప్పటి వరకు  ఎంఎల్ఏల్లో  సగానికి సగం మందికి పైగా సీఎం అపాయింట్ మెంట్ లేకుండా ఉన్నారు..వీరిలో అసలు ఇప్పటి  వరకు సీఎం ను కలవని వారు ఇంకా ఎక్కువ ఉన్నారు.....మరో వైపు   ఏపీ సచివాయలం  వైజాగ్ కు తరలించేందుకు కూడా  సిద్దం అయింది.....దీంతో సీఎం అపాయింట్ మెంట్ ఇస్తే బావుండును   అని ఎదురు చూసే ఎంఎల్ఏల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది..మాకు కనీసం ఒక గంట సమయం కేటాయించండి అని చాలా మంది ఎంఎల్ఏలు సీఎం  ను కలవడం కోసం ఎదురు చూస్తున్నారు...చాలా జిల్లాల్లో మంత్రుల డామినేషన్ ప్రస్తుతం నడుస్తోంది..ఎంఎల్ఏలు తమ వాయిస్ వినిపించాలన్నా కూడా కష్టంగా మారింది..తమ మనసులో మాట సీఎం కు  చెప్పుకోవాలనే ఆవేదనలో ఉన్న శాసన సభ్యులు చాలా మంది ఉన్నారు.వీరు సీఎం ఎప్పుడు కలుస్తాడా  మనసు విప్పి ఎప్పుడు మాట్లాడదామా అని ఎదురు చూస్తున్నారు..అసెంబ్లీ సమావేశాలు జరిగినపుడు కలుద్దామంటే  కుదరని పరిస్థితి,,,,నిత్యం సీఎం బిజీగా ఉంటున్నారు..ఇంట్లో కలుద్దామంటే  రివ్యూలు ,,హడావిడి..దీంతో ఎంఎల్ఏలు సీఎం ను కలవడమే కష్టమయిపోతున్న పరిస్థితి.....

    ప్రభుత్వ కార్యక్రమాలు జనంలోకి తీసు కెళ‌్లడానికి  శాసన సభ్యుల పాత్ర చాలా ఉంది.. ఈ అంశాన్ని ప్రస్తుతం మంత్రులు బాధ్యత తీసుకున్నారు...చాలా ప్రాంతాల్లో మంత్రులకు ఎంఎల్ఏలకు మధ్య గ్యాప్ ఉంది..ఈ  విషయాలు సీఎం తో చర్చించాలి..కానీ  అపాయింట్ మెంట్ దొరకడం లేదు....ఇంచార్జ్ మంత్రులకు ఎంఎల్ఏలకు కూడా గ్యాప్ ఉన్న పరిస‌్థితి ఏర్పడింది....ఎంఎల్ఏలు  తమ జిల్లాల్లో  ఉన్న గ్రూపు రాజకీయాుల  తో పాటు ఇతరత్రా అంశాలు చెప్పుకోవ డానికి తగిన మనిషి లేరనే అభిప్రాయంతో ఉన్నారు 150 మందికి పైగా గెలిచి  సీఎం అపాయింట్ మెంట్ లేకపోవడంతో కొంత మందిలో నిరుత్సాహం అసంత్రుప్తి కూడా ఉన్నాయి...కొంత మంది ఎంఎల్ఏలు మంత్రి పదవులు ఆశిస్తున్న వారు  ఇతరత్రా  కొంత మంది కోసం  నామినేటెడ్ పోస్టుల కోసం ఎదరు చూస్తున్న వారు ఉన్నారు..తమ వర్గంలో కొంత మంది కి నామినేటెడ్ పోస్టులు  కావాలని కూడా అడుగుుతున్నారు..నియోజక వర్గాల్లో  పెండింగ్  పనులు కూడా ఉన్నాయి.ఇలా ఏదో  ఒక కారణంతో సీఎంతో కనీసం ఒక గంట సమయం కావాలని  కోరుకునే ఎంఎల్ఏల సంఖ్య  రో్జు రోజుకు పెరుగుతూ ఉంది.