లిక్కర్ స్కామ్‌లో మాస్టర్ మైండ్ జగన్, భారతి : మాణికం ఠాగూర్

 

వైసీపీ అధినేత జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ ఆరోపించారు. నాసిరకం మద్యంతో రూ. 32,00 కోట్ల కోల్లగొట్టారు. మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్‌రెడ్డి కేవలం పావు మాత్రమే. అసలు ఈ స్కామ్ మాస్టర్ మైండ్ జగన్,భారతి అని మాణికం ఠాగూర్ అన్నారు. లిక్కర్ స్కామ్ డబ్బుతోనే ఎన్నికల్లో ఓట్లు కొన్నారు. 

ఇది జగన్ మొదటి స్కామ్ కాదు గతంలో 43 వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అని మాణికం ఎక్స్ వేదికగా తెలిపారు. వైఎస్ జగన్ 2012లో అరెస్టై 16 నెలలకు పైగా జైలు జీవితం గడిపారని మాణికం ఠాగూర్ అన్నారు. మాజీ సీఎం జగన్ ఎన్నో అక్రమాలు చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియా, మైనింగ్ మరియు భూ కేటాయింపు కుంభకోణాలు, అమరావతి చుట్టూ ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఇప్పుడు, ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టి మద్యం దోపిడీ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.