TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెటా కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన: సోషల్ మీడియా అక్కౌంట్ల నిలిపివేతపై ఆగ్రహం.!

Published on: Sat Nov 21, 2026 9:42AM

జాతీయ యువజన కాంగ్రెస్ నేతల సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతకు నిరసనగా  హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు దిగారు.  గచ్చిబౌలిలోని మెటా కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో చేరిన యూత్ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు.  సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.   

జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్‌తో పాటు  ఇన్‌ఛార్జి మనీశ్ శర్మల సోషల్ మీడియా ఖాతాలను మెటా సస్పెండ్ చేసింది. దీనిపై యూత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   కేంద్రంలోని అధికార బీజేపీకి మెటా అనుకూలంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

నిలిపివేసిన సోషల్ మీడియా ఖాతాలను తక్షణమే పునరుద్ధరించే వరకూ తమ ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. ఆధునిక రాజకీయ కమ్యూనికేషన్‌లో సోషల్ మీడియా కీలక వేదికగా మారిన తరుణంలో ఖాతాలను నిలిపివేయడం తగదన్నారు.

ఇలా ఉండగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ నిబంధనలు, కంటెంట్ విధానాల అమలు తీరుపై పరిశీలకులలో భిన్న ఆభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఖాతాల విషయంలో ఇలా నిలిపివేతలు, సస్పెన్షన్ల విషయంలో వివాదాలకు అతీతంగా మెటా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు. 

ఇది కూడా చదవవండి:  మెటా లాసూట్.. టెక్ చరిత్రలోనే అతి పెద్ద కార్పొరేట్ విచారణ.!​

యూత్ కాంగ్రెస్ ఆరోపణలు, ఆందోళనలపై మెటా స్పందించాల్సి ఉంది. ఖాతాల సస్పెన్షన్ పై మెడీ నుంచి ఎటువంటి వివరణ వస్తుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.  

తాజాగా యూత్ కాంగ్రెస్ జాతీయ నేతల ఖాతాల సస్పెన్షన్ తో  సోషల్ మీడియా వేదికల వినియోగం, ఖాతాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై   మరోసారి విస్తృత చర్చకు తెరలేపింది.

మీకు నచ్చవచ్చు:   ఇండియాను క్షమాపణలు కోరిన మెటా.. ఎందుకంటే?​

డీప్‌ఫేక్ కట్టడిపై గుజరాత్ హైకోర్టు సీరియస్ ... మెటా, ఎక్స్‌లకు నోటీసులు​

[Youth Congress protest,  Meta office  Gachibowli,Suspension social media accounts, Youthcongressleaders, TeluguOne]