మాధవ్ కు వైసీపీ మహిళా నేతల మద్దతు..సిగ్గు సిగ్గు

ఒక మహిళతో అసభ్యంగా వీడియో కాల్ లో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన గోరంట్ల మాధవ్ కు వైసీపీ మహిళా నేతలు మద్దతుగా మాట్లాడటం పై జనం ఆశ్చర్య పోతున్నారు. మహిళా నేతలు అయి ఉండీ.. ఇక అసభ్య వీడియోలో అడ్డంగా దొరికి పోయిన ఎంపీకి మద్దతుగా నిలవడంపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహిళా సంఘాలన్నీ మాధవ్ వ్యవహారంపై మండి పడుతుంటే.. వైసీపీ నేతలు మాత్రం అందుకు భిన్నంగా స్పందించడం పట్ల నిరసన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్ని జరగలేదు.. అయినా ఆ వీడియో నిజమో, మార్ఫింగో తేలకుండా మాధవ్ ను తప్పుపట్టడం ఏమిటని మంత్రి రోజా ప్రశ్నిస్తున్నారు. పైపెచ్చు తెలుగుదేశం హయాంలో ఇంత కంటే ఎక్కువే జరిగాయిగా అంటూ.. మాధవ్ చేసిన ఛండాలాన్ని రోజా సమర్థించడాన్ని మహిళా సంఘాలు తప్పుపడుతున్నాయి.

ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మూడురోజు పాటు సైలెంట్‌గా ఉండి.. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ నిజమో..కాదో తేల్చిచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఓ లేఖరాసి సైలెంట్ అయిపోయారు. ఇక మిగిలిన వారంతా మీడియా కంటపడకుండా ఉండేందుకు చాలా వరకూ ఇంటికే పరిమితమైపోయారు.  ఆ వీడియో వ్యవహారం మరుగున పడే వరకూ సైలంట్ గా ఉండాలన్న వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ ఈ రచ్చ సద్దుమణిగే వరకూ అసలు మాట్లాడకుండా ఉండటమే మేలని భావిస్తున్నారనిపించేలా వ్యవహరిస్తున్నారు.  పార్టీ ఎంపీ మాధవ్ వ్యవహరించిన తీరు  పార్టీ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోందని మోజారిటీ వైసీసీ నేతలు అంటున్నారు. అటువంటి ఎంపీని వెనుకేసుకురావడం ఎంత మాత్రం సరికాదని వారు మొత్తుకుంటున్నారు.