పాలకుడికి, మ్యానిపులేటర్‌కి తేడా ఇదే.. మౌనీ బాబా అయిన బాబు

 

ఎన్నికలకు ముందు టీడీపీ మీద, చంద్రబాబు మీద ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి.. ఎన్నికలు ముగిసి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు.

"తమ వేతనాన్ని 3 వేల నుంచి 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన 'ఆశా' అక్కా చెల్లెళ్లపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి అరెస్టు చేయించాడు చంద్రబాబు. సీఎం జగన్ గారు ముందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300% పెంచుతూ కొత్త ఆశలు నింపారు. పాలకుడికి, మ్యానిపులేటర్‌కి తేడా ఇదే బాబూ." అని ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో.. "ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్ధరిస్తానని కోతలు కోసిన చంద్రబాబుకు జగన్ గారి కేబినెట్ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులివ్వడంపై ఏ వ్యాఖ్యా చేయకుండా మౌనీ బాబా అయ్యారు బాబు." అంటూ ఎద్దేవా చేశారు.