వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేసింది. శనివారం (జులై 19) ఆయనను విచారణకు పిలిచిన సిట్ దాదాపు ఆరు గంటలకు పైగా విచారించిన తరువాత అరెస్టు చేసింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 6గంటలకుపైగా విచారణ తర్వాత సిట్ ఆయన్ని అరెస్ట్ చేసింది.

 ఈ మేరకు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆయనను రేపు కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.  సిట్ విచారణలో  మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించిన సంగతి విదితమే ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టివేశాయి. మిథున్ రెడ్డి అరెస్టుతో ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సిట్ అరెస్టు చేసింది.  అదలా ఉండగా మద్యం కుంభకోణం కేసులు సిట్ ఈ రోజు కోర్టులో తొలి చార్జ్ షీట్ ను దాఖలు చేసింది. అయితే ఈ చార్జిషీట్ లో మిథున్ రెడ్డి పేరు లేదు.