నిరసన సెగలతో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి

ఏపీలో నిరసనల సెగ అధికార పార్టీ నేతలను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నది. తాజాగా విజయవాడలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచార ఘటన నగరాన్ని కదిలించేసింది. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో జనం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను బాధితురాలు చికిత్స పొందుతున్ప ఆసుపత్రి వద్ద నిలదీశారు. ఇప్పుడు ఏం చేద్దామని వచ్చారని ప్రశ్నిస్తూ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. 
సరిగ్గా అదే సమయంలో బాధితురాలిని పరామర్శించేందుకు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ఆసుపత్రికి వచ్చారు. 
\ఆయనను చూడగానే బాధిత కుటుంబ సభ్యులు ఒక్క పరుగున ఆయన వద్దకు వెళ్ల జరగిన సంఘటనను చెబుతూ విలపించారు.  చంద్రబాబు వారిని ఓదార్చారు.  ఇది గమనించిన వాసిరెడ్డి పద్మ బాధితురాలిని పరామర్శించకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu