డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వై ప్లస్ సెక్యురిటీ
posted on Jun 18, 2024 10:46AM
డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం సెక్యురిటీ పెంచింది. వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా, ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపడతారు. మొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్న పవన్ కల్యాణ్‌కు భారీ మానవహారంతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి రైతులు. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్‌కు భద్రత పెంచింది ప్రభుత్వం ఇక సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సోమవారం ఛాంబర్ కేటాయించారు. రెండో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో 212 గదిని ఆయన కోసం సిద్ధం చేస్తున్నారు. జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌కు కూడా అదే అంతస్తులో ఛాంబర్లు కేటాయించారు.