బయటకు రావాలంటే ఆడపిల్లలు భయపడుతున్నారు- నివేదిక

ఆడపిల్లల భద్రత గురించి సాధికారత గురించి ఎన్ని కబుర్లు చెప్పుకొన్నా.... వినడానికి అవన్నీ బాగానే ఉంటున్నాయి కానీ, సమాజంలో మాత్రం ఆడపిల్లల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని వేరే చెప్పనవసరం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాల కేసులే ఇందుకు నిదర్శనం. ఇవన్నీ ఆడపిల్లల మనస మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి కదా! ఇదే విషయాన్ని ఓ నివేదిక వెల్లడిస్తోంది. Wings 2018: World of India Girls, A Study on perception of girls safety in public spaces అనే నివేదిక ప్రకారం ఇరుకైన సందులలో ప్రయణం చేసేందుకు ప్రతి ముగ్గురిలో కనీసం ఒక్కరన్నా భయపిపోతున్నారట. ఇక జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాలలోకి అడుగుపెట్టేందుకు అయితే... ప్రతి అయిదుగురు ఆడపిల్లలో ముగ్గురు ఇష్టపడటం లేదట.