టెండుల్కర్ కొడుకు వచ్చేస్తున్నాడో

 

టెండుల్కర్ ప్రతిభ గురించి చెప్పేదేముంది. ఓసారి ఆయన రికార్డులు చూస్తే సరిపోతుంది. పోయి నా రికార్డులు చూసుకోండి అని ఓసారి టెండుల్కరే చెప్పాడు కదా! టెండుల్కర్ కొడుకు అర్జున్‌కి కూడా క్రికెట్‌ అంటే ప్రాణం. ఆ అభిరుచిని పోషించే తండ్రి ఎలాగూ ఉన్నాడు కదా. అందుకే అర్జున్ అలా అలా క్రికెట్‌లో ఎదుగుతూ ఇప్పుడు అండర్‌-19 స్థాయికి వచ్చాడు. జులై 11 నుంచి శ్రీలంకతో తలపడనున్న జట్టుకి ఎంపికయ్యాడు. మరి అర్జున్ ఫ్యాక్షన్‌ భాషలో చెప్పుకొన్నట్లు పులిబిడ్డలా చెలరేగిపోతాడా... లేక చతికిలపడతాడా చూడాలి. ఎవరి టాలెంట్ వాళ్లది కదా! గవాస్కర్ కొడుకు రోహన్‌ గవాస్కరే నిలదొక్కుకోలేకపోయాడయ్యే!