సజ్జల.. పిల్ల సజ్జల సరే.. ఈ మూడో సజ్జల ఎవరు?

జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డిని  పోలీసులు శుక్రవారం (ఏప్రిల్ 25) అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై వ్యవహరించి  సకల శాఖల మంత్రిగా, సీఎం జగన్ కు కళ్లు, చెవులూ నోరుగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డిఫాక్టో సీఎంగా చక్రం తిప్పిన రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా  సామాజిక మాధ్యమంలో అడ్డగోలు పోస్టులు, అనిచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోయి భ్రష్టుపట్టిన పిల్ల సజ్జల అదేనండి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం సజ్జల భార్గవ  రెడ్డే అందరికీ సుపరిచితులు. కానీ ఇప్పుడు జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం  కుంభకోణం కేసులో అరెస్టయిన ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు అన్న  ఆసక్తి  సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అని చెప్పబడుతున్న రాజ్ కసిరెడ్డి తరువాత అరెస్టైన వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి. మద్యం  కకుంభకోణంలో  ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి వసూల్ రాజాగా వ్యవహరించారనీ,  మద్యం తయారీ కంపెనీలు కమీషన్లు చెల్లించేలా కంపెనీలను వాటిని బెదిరించడం, వసూలు చేసిన కమిషన్లను చేర్చాల్సిన చోటికి చేర్చడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించినది   సజ్జల శ్రీధర్ రెడ్డిది దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. సరే ఇప్పుడు అసలు ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే.. మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. 

జగన్ ప్రభుత్వంలో కీలక ప్రాత పోషించిన, సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో  సజ్జల రామకృష్ణారెడ్డి  తన పలుకుబడిని ఉపయోగించి.. తన కుమారుడు  సజ్జల భార్గవ్ రెడ్డి (పిల్ల సజ్జల) సహా తన   మిత్రులు,బందువులు, సన్నిహితులే కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పేలా చర్యలు తీసుకున్నారు. అలాంటి వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి సమీపబందువు సజ్జల శ్రీధర్ రెడ్డి  ఒకరు. ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి   నంద్యాల మాజీ ఎంపి ఎస్పీవై రెడ్డికి అల్లుడు కూడా.  ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ర్. అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే.. శ్రీధర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామం.2012 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  2019లో నంద్యాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాతే వైసీపీలో చేరారు. చేరి  మద్యం స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు.