టెర్రరిస్టులకు టెర్రర్.. ఇకపై భారత్ లోకి అడుగుపెట్టాలంటే వణుకు పుడుతుంది

 

మన దేశ భద్రతకు మరో తిరుగులేని అస్త్రం దొరికింది. శతృదేశాల నుండి అడ్డదారుల్లో చొరబడే టెర్రరిస్టుల ఆటలను ఇక సాగనివ్వకుండా చేయనుంది. ఏ చిన్న కదలికనైనా ఇట్టే కనిపెట్టేస్తుంది.. అదే కార్టోశాట్ 3 ప్రత్యేకత. 5 ఏళ్ళ పాటు అంతరిక్షం నుంచి నిఘా పెడుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం తర్వాత డీలా పడిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ విజయం ఎంతో హుషారు నిచ్చింది. మరి ఈ ప్రయోగం ద్వారా ఇస్రో ఇంకా ఇలాంటి ఉపగ్రహాలనూ నింగిలోకి పంపింది. నిప్పులు ఎగచిమ్ముతూ నింగి లోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్వీ సి 47 రాకేట్. కాసేపటికే కార్టోశాట్ 3 ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అప్పటిదాకా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న శాస్త్రవేత్తలలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. ఆ హాల్ అంతా చప్పట్లతో మారు మోగి పోయింది. 

నాలుగు నెలల క్రితం ప్రయోగించిన చంద్రయాన్ 2 నిరుత్సాహపరిచింది, అప్పట్నించి ఏదో తెలియని వెలితి. అదే టైమ్ లో ఎలాగైనా కార్టోశాట్ ౩ ని సక్సస్ చేసి తీరాలన్న కసి. ఇదొక్కటే కాదు అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో శాటిలైట్స్ ఉన్నాయి. వీటన్నింటిని విజయవంతంగా కక్ష్యలో చేర్చి చంద్రయాన్ 2 ప్రయోగం మిగిల్చిన బాధను దూరం చేసుకోవాలనుకున్న శాస్త్ర వేత్తల పట్టుదల ఫలించింది. మొత్తం 14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సి 47 రాకెట్ నింగిలోకి తీసుకువెళ్ళింది. ఈ ప్రయోగం ఒక ఇస్రో సైంటిస్ట్ విజయం మాత్రమే కాదు మన దేశం విజయంగా భావించారు. భారత కీర్తి పతాక వినువీధుల్లో మరోసారి రెపరెపలాడింది. ఎందుకంటే ఇది మరి రక్షణ రంగానికి తిరుగులేని ఆయుధం. అంతరిక్షం నుంచి నిరంతరం నిఘా పెట్టే అస్త్రం. ఇప్పట్నించి మరో 5 ఏళ్ల పాటు తిరుగులేని సామర్థ్యంతో పనిచేస్తుంది. శతృదేశాల పన్నాగాలు, టెర్రరిస్టుల కదలికలను కనిపెడుతోంది. ఎప్పటికప్పుడు వారి ఫొటోలు తీసి పంపిస్తుంది, మన సైన్యాన్ని అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు మౌలిక సదుపాయాల అభివృద్ధి తీర ప్రాంత వినియోగం గురించి కూడా సమాచారం అందచేస్తుంది.

ఇప్పటికే ఓ వైపు పాకిస్తాన్ మరో వైపు చైనా దేశాలు పక్కలో బల్లెంలా మారాయి. ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. మరోవైపు ఉగ్రవాదులను భారతదేశం పైకి ఎగదోస్తోంది పాకిస్థాన్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ మరింత పగతో రగిలిపోతోంది. అటు పాక్ కు వత్తాసు పలికే చైనా కూడా కన్నింగ్ నేచర్ కనబరుస్తోంది. అందుకే మన కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాలనుకుంది, కార్టోశాట్ తో అది సాధ్యమవుతోంది. పాక్ భూభాగం లోని టెర్రరిస్టు స్థావరాలపై గతంలో మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ టైంలో రిసార్ట్ శ్రేణికి చెందిన శాటిలైట్ ఆర్మీకి సహకరించింది. కార్టోశాట్ 3 రీశాట్ కంటే పవర్ ఫుల్, రీశాట్ శ్రేణుల్లో కార్టోశాట్ 3 మూడో తరం ఉపగ్రహం. 25 సెంటీమీటర్ల హై రిజల్యూషన్ తో ఫొటోలు తీసే సామర్థ్యం దీని సొంతం. పాక్ సైనికులు ఉగ్రవాదుల స్థావరాలను ఫొటోలు తీసి మరింత స్పష్టంగా చూపగలుగుతుందని భావిస్తున్నారు. 

పీఎస్ఎల్వీ సీ 47 రాకెట్ ద్వారా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండో లాంచింగ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం విజయవంతమైన తర్వాత కార్టోశాట్ 3 నుంచి అంటార్కిటికా లోని ఇస్రో కేంద్రానికి సంగీతాలూ అందాయి. ఈ శాటిలైట్ ను భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో ఉంచారు. కార్టోశాట్ ౩ కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దీని తయారీకి 350 కోట్లు ఖర్చయింది. ఈ శాటిలైట్ బరువు 1,625 కిలోలు. కార్టోశాట్ 3 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. మిగతావి అమెరికాకు చెందినవే. వీటిలో 12 ఫ్లోప్ ఓర్సి నానో ఉపగ్రహాలు ఉన్నాయి. 5 కిలోల చొప్పున బరువుండే వీటిని డౌ అంటే పావురాలు అని పిలుస్తారు. అమెరికా లోని ప్లానెట్ ల్యాబ్స్ సంస్థ వీటిని తయారు చేసింది. ఇప్పటి దాకా మన దేశం నుంచి 92 డౌ టౌన్ శాటిలైట్ లను ప్రయోగించారు. వీటిలో 66 ఇంకా పని చేస్తునే ఉన్నాయి. ఇక మరోటి మిస్ బెస్ట్ శ్యాటిలైట్ అమెరికాకు చెందిన స్పేస్ ఇంక్ సంస్థ దీన్ని రూపొందించింది. ఉపగ్రహం అందించే డేటాను వివిధ దేశాల్లోని కంపెనీలకు ఈ సంస్థ విక్రయిస్తోంది. ఇస్రో ప్రయోగాల సక్సెస్ రేటు చాలా ఎక్కువ, కానీ చంద్రయాన్ 2 నిరాశపరిచింది. లాస్ట్ మినిట్ లో తలెత్తిన సాంకేతిక లోపం దేశం మొత్తాన్ని నివ్వెరపరచింది. అయినా అది ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే ఇప్పటికే సాఫ్ ల్యాండింగ్ చేసిన ఎన్నో దేశాలకంటే మనం మెరుగైన ఫలితమే సాధించాం. మరి విక్రమ్ లాండర్ విషయంలో అసలేం జరిగింది. వీరిపై ఇస్రో ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయలేదు.