వెల్దీ, హెల్దీ, హ్యాపీ.. చంద్రబాబు నినాదం

ఆరు శాసనాలతో నూతనత్వాన్నీ, కొత్త నాయకత్వాన్నీ తీసుకు వచ్చామని చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహానాడులో తీర్మానించుకున్న ఆరు శాసనాలనూ తు.చ. తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వీటి ద్వారా అద్భుత ఫలితాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర2047 లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రతి ఏడాదీ ప్రోగ్రస్ రిపోర్టు ఇస్తామని, ఎంత సాధించాం.. ఇంకా సాధించాల్సిందేమిటి?  అంశాలను సమీక్షించుకుని 2029 నాటికి పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.  పార్టీకి కార్యర్తే అధినేత అని పునరుద్ఘాటించారు. 

 ప్రస్తుతం రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షల 67 వేలు. వచ్చే 22 ఏళ్లలో దానిని రూ.55 లక్షలే చేసే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పిన ఆయన. వెల్దీ, హెల్దీ, హ్యాపీ అన్నదే మన నినాదం అన్నారు. కోడూరు నుంచి సైకిల్‌పై   మహానాడుకు హాజరైన కార్యకర్తను ఈ వేదికపై సీఎం సన్మానించారు. ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విజ్ఞప్తి మేరకు కడపకు తాగునీటి సమస్యను పరిష్కరించడంతో పాటు, బుగ్గవంక చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి సభా ముఖంగా హామీ ఇచ్చారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu