అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆనం: ముఖ్యాంశాలు

 

 

 

శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ నేతల ఆందోళనల మధ్య ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సభలో 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.1,83,129 కోట్లతో 2014-15 వార్షిక బడ్జెట్‌ను మంత్రి ఆనం ప్రతిపాదించారు. వరుసగా నాలుగో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు.పరిపాలన పరంగా అత్యుత్తమ రాష్ట్రంగా ఇండియా టుడే అవార్డు లభించిందన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశాం. 98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బడ్జెట్ పై అధ్యయానికి రేపు ఉభయసభలకు సెలవు ఇచ్చారు.

 

బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు:

* ప్రణాళిక వ్యయం : రూ.67,950 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం :రూ. 1,15,179 కోట్లు
* రెవెన్యూ నిధులు అంచనా : రూ. 474 కోట్లు
* ద్రవ్యలోటు అంచనా: రూ. 25,402 కోట్లు