బేటెక్ సిటీ: విశాఖకు అదనంగా హైటెక్ సిటీ తరహాలో కొత్త నగరం.!
Published on: Wed Nov 25, 2026 2:22PM

కొత్త ఆవిష్కరణలు, కొంగ్రొత్త లక్ష్యాలు, సరికొత్త నగర నిర్మాణాలు నిత్య లక్ష్యాలుగా, వ్యాపకాలుగా ముందుకు సాగే ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నాన్ని ఆర్థిక, సాంకేతిక ప్రగతి, పురోభివృద్ధి కోసం ఒక కొత్త నగర నిర్మాణానికి కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే శరవేగంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం సాగుతుండగా దానికి సమాంతరంగా, హైదరాబాద్ లో హైటెక్ నగరాన్ని నిర్మించి ఐటీ రంగంలో సాధించిన అద్భుత పురోగతిని నిలువెత్తు నిదర్శనంగా మలచిన తీరులోనే.. ఆంధ్రప్రదేశ్ లోని కీలక నగరం విశాఖ పట్నంలోనూ ఒకనూ తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్నారు. హైదరబాద్ లో హైటెక్ మ్యాజిక్ ను మరింత గొప్పగా, ఉన్నతంగా విశాఖలో పునరావృతం చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అందులో భాగంగా ప్రగతిని కళ్లకు కట్టేలా విశాఖ నగరానికి తోడుగా కొత్త నగరంతో , సరికొత్త గుర్తింపు తీసుకువచ్చేనా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే విశాఖ నగరానికి అనుబంధంగా బేటెక్ సిటీని నిర్మించే యోచన చేస్తున్నారు. తద్వారా దేశంలోనే ఫైనాన్షియల్, టెక్నాలజీ హబ్‌గా విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా ప్రగతి ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నగరంలో 'హైటెక్ సిటీ'ని నిర్మించి ఐటీ రంగంలో సాధించిన అద్భుత విజయాన్ని ఇప్పుడు విశాఖపట్నంలోనూ పునరావృతం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
విశాఖకు సహజసిద్ధంగా ఉన్న సువిశాల సముద్ర తీర ప్రాంతం, పోర్టు సదుపాయాలు, పారిశ్రామిక మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నలక్ష్యంతో పేరు మార్పు ఆలోచనతో చంద్రబాబు ముందుకు సాగుతున్నట్లు సమచారం. అంటే ఇప్పుడు ఉన్న విశాఖ పట్నానికి అదనంగా బేటెక్ సిటీ నిర్మాణానికి ఆయన అంకురార్పణ చేయనున్నారన్న మాట.

ఈ ప్రతిష్టాత్మక బే సిటీ పనులను వేగవంతం చేయడానికి ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో, ప్రైవేట్ రంగానికి చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ( భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక పాలనా వ్యవస్థ పని చేస్తుంది. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు, ప్రాజెక్టుల అమలును నిరంతరం పర్యవేక్షించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన ఒక ఫోరమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమచారం. దీనివల్ల పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీలకు వేగంగా అనుమతులు లభించడంతో పాటు పనుల్లో జాప్యం నివారించవచ్చన్నది చంద్రబాబు భావనగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!
విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో భాగంగా ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. సాగరతీర నగరమైన విశాఖను సైబరాబాద్ తరహాలో ఆధునిక నగరంగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించవచ్చని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ బే టెక్ సిటీ పరిధి కైలాసగిరి నుంచి భీమిలి వరకూ ఉంటుంది. ఈ బే టెక్ సిటీ అందుబాటులోకి వస్తే రాబోయే రోజుల్లో విశాఖపట్నం రూపురేకలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఐటీ, డేటా సెంటర్లు, ఆర్థిక సంస్థల రాకతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
మీకు నచ్చవచ్చు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే భోగాపురం ఎయిర్పోర్ట్ : లోకేష్
రెండు రోజుల సీఐఐ సదస్సు: కుదిరిన ఎంవోయూల విలువెంతంటే.?
[Vizag Bay Tech City, Adition to Visakhapatnam, Chandrababu Naidu, Hyderabad, Hitech City, Andhra Pradesh Tech Hub, TeluguOne]


