TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రికీ పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టిన కింగ్ కోహ్లీ: ఇంతకీ ఆ రికార్డేంటో తెలుసా.?

Published on: Sat Nov 7, 2026 2:07PM

భారత క్రికెట్ దిగ్గజం, రికార్డుల వీరుడు, పరుగుల రారాజు కింగ్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మరో   ఘనత  సాధించాడు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ  కివీస్ జట్టుపై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ పేరుతో ఉన్న  ప్రపంచ రికార్డును  బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌కు ముందు వరకు రిక్కీ పాంటింగ్   విరాట్ కోహ్లీ ఇద్దరూ 1,971 పరుగులతో సమంగా ఉండగా, రెండో వన్డేలో కోహ్లీ   ఒక్క పరుగు చేయగానే ఈ రికార్డును తన పేరు మీదకు మార్చుకున్నాడు. మ్యాచ్ ప్రారంభంలో ఎదుర్కొన్న రెండో బంతినే బౌండరీకి తరలించి ఈ ఘనత సాధించాడు.

 

ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగినప్పటికీ, అంతర్జాతీయ వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

ఇది కూడా చదవండి: కివీస్‌తో తొలి వన్డే: భారత్ అద్భుత విజయం.. మెరిసిన కోహ్లీ.!

ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ తన కెరీర్‌లో కివీస్‌పై 51 మ్యాచ్‌లు ఆడి 50 ఇన్నింగ్స్‌ల్లో 1,971 పరుగులు సాధించగా, విరాట్ కోహ్లీ   38 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును అధిగమించడం విశేషం.

న్యూజిలాండ్‌పై కోహ్లీ వన్డే సగటు   56 పైగా ఉండగా, ఇందులో 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో, న్యూజిలాండ్‌పై 2,000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా నిలిచే అరుదైన అవకాశం కోహ్లీకి ఉంది. 

ఇటీవల ముగిసిన తొలి వన్డేలోనూ కోహ్లీ కీలకమైన 74 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు, వన్డేల్లో నెం.3 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి ఆటగాడిగా వరల్డ్  రికార్డు సృష్టించాడు.  

మీకు నచ్చవచ్చు: ఫీల్డింగ్ లో అదరగొట్టిన రోకో: కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్, రోహిత్ మెరుపు రనౌట్.!

 రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ: మరో ప్రపంచ రికార్డ్.. ఏంటో తెలుసా.?

[Virat Kohli world record, Virat Kohli vs New Zealand, Ricky Ponting Record Broken, ODI Most Runs Against New Zealand, TeluguOne]