ఫీల్డింగ్ లో అదరగొట్టిన రోకో: కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్, రోహిత్ మెరుపు రనౌట్.!
Published on: Wed Nov 4, 2026 1:35PM

క్రికెట్‌లో దశాబ్దాలుగా తమ అద్భుత ఆటతో అభిమానులను అలరిస్తూ, రికార్డులను కొల్లగొడుతూ రాణిస్తున్న టీమ్ ఇండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్, శర్మ, విరాట్ కోహ్లీ ఈ వయస్సులోనూ ఫీల్డ్ లో మెరుపులు మెరిపిస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ లో తొలి వన్డేలో ఈ ఇరువురూ కూడా తమ అద్భుత ఫీల్డింగ్ తో అందరినీ అచ్చెరువొందలా చేశారు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ తామెంత కీలకమో చాటారు.
తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ను భారత బౌలర్లు ముప్పతిప్పలు పెట్టారు. అదలా ఉంచితే ఇన్నింగ్స్ 22వ ఓవర్లో రోహిత్ శర్మ మెరుపు వేగంతో కదిలి డాలిల్ మిచెల్ ను రనౌట్ చేసిన తీరు క్రీడాభిమానులు మంత్రముగ్ధులయ్యేలా చేసింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ లెగ్ సైడ్ షాట్ ఆడి పరుగుకోసం ప్రయత్నించాడు. అయితే రోహిత్ మెరుపు వేగంతో కదిలి బంతిని అందుకుని అండర్ ఆర్మ్ త్రో డారెల్ మిచెల్ ను రనైట్ చేశాడు. రోహిత్ శర్మ విసిరిన బంతి నేరుగా వికెట్ల వద్ద కీపర్ కేఎల్ రాహుల్ చేతిలో పడింది. రాహుల్ క్షణం ఆలస్యం చేయకుండా బెయిల్స్ పడగొట్టాడు. దీంతో డారెల్ మిచెల్ రనౌట్ గా వెనుదిరిగాడు.

ఇక మ్యాచ్ 29వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ అంతకు మించిన అద్భుత ఫీల్డింగ్ తో న్యూజిలాండ్ బ్యాటర్ నాథన్ స్మిత్ ను ఔట్ చేశాడు. అన్షుల్ కాంబోజ్ వేసిన బంతికి న్యూజిలాండ్ బ్యాటర్ నాథన్ స్మిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి బ్యాట్ అంచుకు తాకిన బంతి సెకండ్ స్లిప్ వైపు వేగంగా దూసుకొచ్చింది. స్లిప్స్ లో ఫీల్డ్ చేస్తున్న విరాట్ కోహ్లీ కుడివైపునకు డైవ్ చేస్తూ, నేలను తాకుతున్న బంతిని సింగిల్ హ్యాండ్ తో ఒడిసి పట్లుకున్నాడు. ఈ ఫీల్డింగ్ విన్యాసాలు టీమ్ ఇండియాలో రోకో ఎంత విలువైన ఆటగాళ్లో మరోసారి తేటతెల్లమైంది.
[Rohit Sharma nd Virat Kohli Fielding Excellence, Roko Runout, Stunning Catch, IND vs NZ 1st ODI, Sports News, TeluguOne]


