మరోసారి కోహ్లీపై ఆసీస్.. అతనో ఉన్మాది..

 

ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ లు ఎంత హోరా హోరీగా సాగాయా.... రెండు జట్ల మధ్య వివాదాలు కూడా అలాగే వచ్చిపడ్డాయి. దీంతో టీమిండియాపై ఆసీస్... ఆసీస్ పై టీమిండియా విమర్సలు గుప్పించుకున్నారు. అయితే అస్టేలియా మాత్రం అంతటితో ఆగకుండా టీమిండియా కెప్టెన్ అయిన కోహ్లిని ట్రంప్ తో పోల్చుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు తాజాగా మరోసారి విరాట్‌ కోహ్లీపై ఆసీస్ మండిపడింది. విరాట్‌ కోహ్లీ 'క్లాస్‌ లెస్‌' ఆటగాడని.. అతను చిన్నపిల్లాడికంటే దారుణంగా ప్రవర్తిస్తాడని పేర్కొంది. నాలుగో టెస్టు విజయం తర్వాత కోహ్లీ మాట్లాడిన తీరు వల్ల అతన్ని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇక ముందెన్నడూ స్నేహితుడిగా చూడరని చెప్పింది. మురళీ విజయ్‌పై అనవసరంగా నోరు పారేసుకున్న స్టీవ్‌ స్మిత్‌ క్షమాపణలు కోరాడని.. కోహ్లీ కూడా ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లకు క్షమాపణ చెప్పాలని హెరాల్డ్‌ సన్‌ అనే పత్రిక డిమాండ్‌ చేసింది.  కోహ్లీ ఓ ఉన్మాది అని కూడా వ్యాఖ్యానించింది. మరి దీనిపై కోహ్లి ఎలా స్పందిస్తాడో చూడాలి.