ఓటీటీలోకి విజయ్ ఆంటోని కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన కొన్ని సినిమాలు నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన "లవ్ గురు".. ఏప్రిల్ 11 న థియేటర్లలో విడుదల కాగా పర్వాలేదనిపించింది. 

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విజయ్ ఆంటోనీ.. బిచ్చగాడు-2 తో మరింత చేరువయ్యాడు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ' రోమియో'. తెలుగులోకి "లవ్ గురు" పేరుతో విడుదలైంది. మృణాలిని రవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా తమిళ్ లో ఈ సినిమా మే 10 వ తేది నుండి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ విషయం తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్ ని పంచుకుంది. తెలుగు వర్షన్ కూడా అదే రోజున వచ్చే అవకాశాలున్నాయి. 

అరవింద్ (ఆంటోనీ) మలేషియాలో కేఫ్ నడుపుతుంటాడు. అయితే తన చెల్లి గురించి ఓ చేదు అనుభవం ఎప్పుడు అరవింద్ ని వెంటాడుతుంది‌.  అరవింద్ కి 35 ఏళ్ళు వయసొచ్చిన ప్రేమ ఉండదు.. పెళ్ళి చేసుకోడు. ఇక ఇండియాకి వచ్చి పెళ్ళి చేసుకుందామని అనుకున్నాడు. అరవింద్ తన బంధువుల ఇంటికి వెళ్ళగా అక్కడ లీలా(మృణాలిని రవి) ని చూసి ఇష్టపడతాడు. వెంటనే అరవింద్ తల్లిదండ్రులు లీలతో పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వాళ్ళింటికి వెళ్తారు. కానీ లీలాకి పెళ్ళి ఇష్టం ఉండదు..తనకు హీరోయిన్ అవ్వాలని కోరిక ఉంటుంది‌‌.  లీలా తండ్రికి తను హీరోయిన్ అవ్వడం ఇష్టం ఉండక అరవింద్ తో పెళ్ళి చేస్తాడు. పెళ్ళి అయిన  తర్వాత రోజే లీలాకి పెళ్ళి ఇష్టం లేదని, హీరోయిన్ అవ్వాలనేది తన డ్రీమ్ అని అరవింద్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ. మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి వచ్చే సినిమాని ఓసారి చూసేయ్యండి.