శ్రీ వెంగమాంబ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ  శ్రీ వెంగమాంబ  దేవస్థానంలో జూన్ 15వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను   ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్   ఆవిష్కరించారు.  

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూల నుంచీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.   భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు కాకర్ల సరేష్ చెప్పారు.  పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై చర్చించారు.  పారిపారిశుద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu