కుడి ఎడమైతే పొరపాటు లేదా.. బయటపడ్డ వెల్లంపల్లి డ్రామా

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌డానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకాడ‌రు. ఈ విష‌యం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైంది. కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందిన జ‌గ‌న్‌.. బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపైనెట్టి  ప్ర‌జ‌ల సానుభూతి ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ ఏపీ ప్ర‌జ‌ల‌పై మ‌రోసారి సానుభూతి ఆస్త్రం ప్ర‌యోగించేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లినీ చెల్లినీ గెంటేసి ఒంటరినయ్యానంటూ బేలకబుర్లు చెబుతున్నారు. అవి పని చేయడం లేదని గ్రహించి  రాయిదాడి డ్రామాకు తెరలేపారు.

జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న జగన్ పై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు రాయిదాడి చేశారు. ఆ రాయి జ‌గ‌న్ కంటి పైభాగంలో త‌గిలి ప‌క్క‌నే ఉన్న వైసీపీ అభ్య‌ర్థి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కంటికి త‌గిలింది. అయితే, ఆ రాయి ఎవ‌రికీ క‌నిపించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న ఎన్నిక‌ల డ్రామాలో భాగ‌మ‌ని మెజార్టీ ప్ర‌జ‌లు సైతం కొట్టిపారేశారు. దీంతో జ‌గ‌న్ సానుభూతి డ్రామా  ఫెయిల్ అయింది. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చారంలో సానుభూతికోసం వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కంటికి పెద్ద క‌ట్టువేయించుకున్నాడు.. మొన్నటి వ‌ర‌కు ఆయ‌న ఎడ‌మ కంటికి క‌ట్టువేయించుకోగా.. ప్ర‌స్తుతం ఆ క‌ట్టు కుడి కంటికి షిప్ట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మొత్తం రాయి దాడి అంతా డ్రామా అన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా తేల్చి పారేసింది.  

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాబోతుందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కూట‌మి అభ్య‌ర్థుల‌కు ప్ర‌జ‌ల్లో ల‌భిస్తున్న మ‌ద్ద‌తుతోపాటు..   స‌ర్వేల‌న్నీ కూట‌మి అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని తేల్చిచెప్పేశాయి. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో రాష్ట్రాన్ని అభివృద్దిలో పూర్తిగా వెన‌క్కు నెట్టేశారు. ప్ర‌జ‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్ప‌న క‌రువై.. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొర‌క్క ఇత‌ర రాష్ట్రాల‌కు వలః వెళ్లిన‌ ప‌రిస్థితి. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు మేమంతా సిద్ధం పేరుతో జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న బ‌స్సు యాత్ర‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌రువైంది. బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌లు ఆశించిన స్థాయిలో రాక‌పోవ‌డంతో స్థానిక నేత‌ల‌పై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు వైసీపీ వ‌ర్గీయుల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై సానుభూతి అస్త్రాన్ని ప్ర‌యోగించ‌డం ద్వారా తండోప‌తండాలుగా ప్ర‌జ‌లు బ‌స్సు యాత్ర‌ల‌కు త‌ర‌లివ‌చ్చేలా చేయ‌డంతోపాటు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును మ‌ళ్లీ త‌మ‌వైపుకు తిప్పుకోవ‌చ్చ‌ని వైసీపీ నేత‌లు ప్లాన్ వేశారు. ప్లాన్ ప్ర‌కారం.. జ‌గ‌న్ బ‌స్సు యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింది. ఈ రాయి జ‌గ‌న్ కంటి పైభాగంలో త‌గిలి, ప‌క్క‌నే ఉన్న వైసీపీ అభ్య‌ర్థి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కంటికి త‌గిలింది. రాయిదాడి ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన ప్ర‌జ‌లు.. ప్ర‌స్తుతం రాయిదాడి ఘ‌ట‌న వైసీపీ రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మేన‌ని తేల్చేశారు.

 జ‌గ‌న్ పై రాయిదాడి ఘ‌ట‌న‌ను తెలుగుదేశం నేత‌ల‌పై నెట్టాల‌ని వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలో రాయిదాడి చేసింది వీరే అంటూ కొంద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం నేత, ఆ పార్టీ అభ్య‌ర్థి బోండా ఉమాను ఇరికించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, వైసీపీ నేత‌ల ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. రాయిదాడి ఘ‌ట‌న‌లో ఎడ‌మ కంటికి గాయ‌మైంద‌ని వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కు వైద్యులు పెద్ద క‌ట్టువేశారు. ఎడ‌మ కన్ను మొత్తానికి క‌ట్టు క‌ట్టారు. క‌న్నుకు పెద్ద క‌ట్టుతోనే వెల్లంప‌ల్లి ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొంటున్నాడు. త‌న‌పై రాయిదాడి చేశారని ప్ర‌జ‌ల‌కు చెబుతూ సానుభూతి పొందే  ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా వెల్లంప‌ల్లి కంటి గాయం ఒట్టి డ్రామా అని బ‌య‌ట‌ప‌డింది. మొన్న‌టి వ‌ర‌కు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఎడ‌మ కంటికి గాయ‌మైన‌ట్లు క‌ట్టు క‌ట్టుకోగా..   రెండు రోజుల క్రితం త‌న ప్ర‌చారంలో కుడి కంటికి క‌ట్టు క‌ట్టుకుని ప్రచారంలో పాల్గొన్నారు. వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన ప‌లువురు వైసీపీ నేత‌లు జ‌గ‌న్ ప్లాన్ మొత్తాన్ని పాడుచేశావు క‌ద‌య్యా అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయిదాడి ఘ‌ట‌న కేవ‌లం వైసీపీ నేత‌లు ఆడిన డ్రామా అని, ఆ విష‌యంపై వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ స్ప‌ష్ట‌త ఇచ్చాడంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో నిజ‌మైంది కాదు.. అస‌లు కుడి కంటికి వెల్లంప‌ల్లి క‌ట్టే క‌ట్టుకోలేదు అంటూ వైసీపీ నేత‌లు పేర్కొంటున్నారు. మొత్తానికి జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న వివాదం కాస్తా వెల్లంప‌ల్లి ఓవరేక్షన్ తో సానుభూతి కోసం ఆడిన డ్రామాగా సందేహాలకు అతీతంగా రుజువైపోయింది. జగన్ బకరాగా మిగిలిపోయారు.  పాపం తగలని గాయానికి కట్టే బ్యాండేజే కదా కుడి ఎడమైతే పొరపాటెందుకౌతుందని ఆ కట్టు కట్టిన వైద్యుడు భావించాడేమో అంటే నెటిజనులు వెటకారం చేస్తున్నారు. 

ఇలా ఉండ‌గా వెల్లంప‌ల్లి కంటి బ్యాండేజ్ ఎడ‌మ నుంచి కుడివైపుకి షిప్ట్ అయినట్లుగా వ‌స్తున్న వార్త‌లు ఫేక్ అని వైసీపీ ఖండిస్తోంది.అయినా జ‌నం మాత్రం వెల్లంప‌ల్లి కంటికి తీవ్ర గాయ‌మ‌యిందంటే న‌మ్మ‌డం లేదు.సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న సెటైర్ల‌ని అస‌లు రాయిదాడే ఫేక్ అని చెబుతున్నారు.