నల్లధనం నిరోధానికి సమగ్ర బిల్లు

దేశంలో నల్లధనం నిరోధానికి సమగ్ర బిల్లు రూపకల్పన చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే నల్లధనం నిరోధక బిల్లు ప్రవేశపెడుతామని తెలిపారు. నల్లధనం నియంత్రణ కోసం ఆదాయపన్ను చట్టానికి సవరణ చేస్తామని చెప్పారు. నల్లధనం ఆరికట్టడం, ఉపాధి కల్పన ప్రాధమ్యాలు. పన్ను ఎగవేతదారులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామన్నారు. విదేశీ ఆస్తులు వెల్లడించకపోయినా, వివరాలు సక్రమంగా లేకపోయినా కఠిన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. రూపాయి ఆదాయం లేకపోయినా విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. మనీల్యాండరింగ్ చట్టాల్లో మార్పులు, సవరణలు చేస్తామని ప్రకటించారు. ఇతర దేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించకపోతే సమానస్థాయి దేశీయ ఆస్తుల జప్తు జరుగుతుందన్నారు. బినామీ ఆస్తులపై కొరడా ఝులిపిస్తామని హెచ్చరించారు.