తుమ్మల ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య

ఖమ్మం జిల్లాలో పంద్రాగస్టు రోజు రాజకీయ కక్షలకు తెరాస నాయకుడు ఒకరు బలయ్యారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లికి చెందిన తెరాస నాయకుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు  గురయ్యారు. తమ్మినేని కృష్ణయ్య మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు.

తమ్మినేని కష్ణయ్య హత్యతో ఒక్క సారిగా సంచలనం రేపింి. సోమవారం ఉదయం జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం తమ్మినేని కృష్ణయ్య తన అనుచరుడితో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా ముత్తేశం వద్ద వెనుక నుంచి ఆటోలో వచ్చిన దుండగులు ఆ వాహనాన్ని ఢీ కొట్టారు. దంతో కృష్ణయ్య  రహదారి పక్కన ఉన్న కాలువలో పడిపోయారు. కింద పడిన కృష్ణయ్యపై వేటకొడవళ్లు, కత్తులతో  దాడి చేశారు.

రెండు చేతులు నరికేశారు. తలపై కూడా కత్తులతో దాడి చేయడంతో కృష్ణయ్య అక్కడికక్కడే మరణించారు.   హత్యకు సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు.  కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్‌ క్వారీలోని పొక్లెయిన్‌ను తగలబెట్టారు.

తెల్దారుపల్లి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కాగా.. కోటేశ్వరరావు ఆయనకు  కృష్ణయ్య శరీరంపై 15 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళి అర్పించారు. హత్య ఘటనపై మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలని కోరారు.