హైదరాబాద్‌లో కాసేపట్లో మళ్లీ వర్షం

నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
హైదరాబాద్‌లో సాయంత్రం ఆరు గంటల తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఈ క్రమంలో ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వారు వర్షం, ట్రాఫిక్ తీవ్రతను చూసుకుని ప్లాన్ చేసుకొని వెళ్లాలని అధికారులు సూచించారు.
. గత కొన్ని గంటలుగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరింది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది నీటిని క్లియర్ చేస్తున్నారు.
మరోవైపు గడిచిన గంట సేపట్లో 70కి పైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు