ప్రేమ, కరోనా రెండు జయించిన.. టీఆర్ఎస్ యువజన లీడర్ చివరికి..
posted on Jun 9, 2021 9:46AM
అతను ప్రేమను జయించాడు.. పెళ్లి అయి జస్ట్ మూడు నెలలు మాత్రమే అవుతుంది.. కరోనా అందరిని కాటు వేసినట్టే కాలంతో పాటు అతని కూడా కరోనా కాటు వేసింది.. అయిన కరోనాను కూడా జయించాడు.. అంత బాగానే ఉందన్న టైం లో మరో మహమ్మారి బారిన పడ్డాడు ఆ యువకుడు.. దాడుపు చాలా డబ్బు ఖర్చు పెట్టారు అయిన ఫలితం లేకపోయింది. అతను ఆ మహమ్మారి తో పోరాడి, పోరాడి అతని సత్తువ కోల్పోయాడు.. చివరికి ఆ గుండె ఆగిపోయింది.. కొత్త పెళ్లి కూతురు ఆశలు గాలిలో కలిసిపోయాయి.. అతని కుటుంబం కన్నీరు ఇంకెలా ఏడిచారు అయిన ఏం చేస్తాం.. ప్రజల ప్రాణాలు పాలకులకు పట్టవయో.. సామాన్యుడికి ఆసుపత్రుల్లో వైద్యం దొరకడాయే.. దద్దులు డబ్బులు తీసుకొని ఓటు వేయడం.. మన వాళ్ళు చనిపోతే ఏడవడం తప్పా మనమే చేస్తాం చెప్పండి.. సరేలే ఇనేవాడు ఉంటే భగవత్ గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎంతో చెప్పినట్లు..ఈ విషయాలు మాట్లాడుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి కానీ అసలు విషయంలోకి వెళ్దాం..
అది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారం మున్సిపాలిటీ పరిధిలో యంనం పేట గ్రామం.. ఆ గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు. అతని వయసు 29 సంవత్సరాలు. అదే గ్రామానికి చెందిన యువతికి ప్రేమించాడు.. అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ఈ విషయమై పెద్దలకు చెపితే ఒప్పుకుంటారు అన్న నమ్మకం తో తన ప్రేమ విషయం పెద్దలకు చెప్పాడు మొదటి అందరి పెద్దల లాగే ఒప్పుకోక పోయిన రాజేష్ మెల్లి మెల్లిగా వాళ్ళను ఒప్పించాడు. చివరికి కోరుకున్న ప్రేయసిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఇంట్లో ఒక విషాదం జరిగింది.. ఈ విషాదం ఏంటో తెలుసుకోవాలని ఉందా..? మారేందుకు ముందుకు పదండి..
ఇది కనికరం లేని కరోనా కాలం.. ఎవరు దొరికితే వాళ్ళను గడ్డలా తన్నుకుపోతుంది. అనేక జీవితాల్ని నాశనం చేసింది. వందల కుటుంబాల్ని శోకం సంద్రంలోకి నెట్టింది. పెద్ద చిన్నా, ముసలి ముతక అనే తేడా లేకుండా వేలాది మంది ప్రాణాల్ని బలితీసుకుంది. కరోనా కాటుకు అనేకమంది తమ జీవితాల్ని అర్థంతరంగా ముగించారు. నక్క రాజేశ్ మూడు నెలల క్రితమే వీరిద్దరి ప్రేమ పెళ్లి జరిగింది. జీవితం ఆనందంగా సాగిపోతుందనుకున్న క్రమంలో అతడికి కరోనా సోకింది. వివాహం జరిగిన నెల రోజులకే రాజేశ్‌కు కరోనా సోకింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో నెలరోజుల పాటు చికిత్స తీసుకొని మహమ్మారిపై విజయం సాధించాడు.కానీ చివరికి బ్లాక్‌ఫంగస్ ప్రాణాలు తీసింది. కొద్దిరోజులకే మరోసారి అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చేరాడు. టెస్టులు చేయగా రాజేశ్‌కు బ్లాక్ ఫంగస్ సోకిందని తెలిసింది. దీంతో అతడి కన్ను కూడా వైద్యులు తొలగించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. రాజేశ్ టీఆర్ఎస్ యువజన విభాగంలో పనిచేస్తున్నాడు. రూ.27 లక్షలు ఖర్చు పెట్టినా తమ కొడుకు ప్రాణాలు దక్కలేదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.