టీఆర్ ఎస్ కు ఎన్నికల విరాళం రూ.153కోట్లు
posted on Oct 17, 2022 5:24PM
భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ ఎస్)గా పేరు మార్చుకున్న టీఆర్ ఎస్‌కు 2021-22 సంవత్సరానికి రూ.193. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి రూ.60 కోట్లు ఎన్నికల విరాళాలు జమ అయింది. అయితే టీఆర్ఎస్ మాత్రం రూ.153 కోట్ల మేరకు వచ్చాయని ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో ప్రకటిం చుకుంది.
ఎన్నికల కమిషన్‌కు ఎన్నికల సమయంలో వచ్చిన నిధుల గురించిన నివేదికలు సమర్పించిన ఇతర పార్టీల్లో వైసీపీ, శిరోమణి అకాలీదళ్(రూ.50లక్షలు), సమాజ్‌వాది పార్టీ(రూ.3.21 లక్షలు) ఉన్నాయి. 2020-21లో వైసిపికి రూ.96.25 కోట్లు ఎలక్టొరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని ప్రకటించగా, ఎస్ ఏ డి, ఎస్.పీ పార్టీలు తమకు ఆ రూపంలో ఏమీ రానట్టే ప్రకటించుకున్నాయి. 2019-20లో సాధారణ ఎన్నికల సంవత్సరంలో, ఎస్.పీకి రూ.108 కోట్లు బాండ్స్రూపంలో రాగా, టీఆర్ ఎస్‌కు రూ.98.15 కోట్లు వచ్చాయి.
కాగా, 2021-22 సంవత్సరానికిగాను తమ పార్టీలకు అందిన విరాళాల గురించి వివరాలను కేవలం మూడు పార్టీలే తెలియజేశాయి. బీఎస్‌పీ మాత్రం ఇంకా ఏమీ అందుకోలేదని పేర్కొన్నది. అయితే ఎన్ సీ పీ మాత్రం రూ.57.9 కోట్లు, ఎన్‌పిపి రూ.34.5లక్షలు విరాళాలు అందుకున్నట్టు ప్రకటించాయి. అయితే 16 ప్రాంతీ య పార్టీలు ఈ ఏడాదికి ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ పేర్కొన్న వివరాల్లో మరింత ఎక్కువే ఉండ వచ్చు. అత్య ధిక స్థాయిలో కార్పోరేట్ నిధులు వచ్చే ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి అనేక ప్రాంతీయ పార్టీలకు 2021- 22 సంవత్సరానికి గాను చెప్పుకోదగ్గ నిధులు వచ్చాయి. వివరాల్లోకి వెళితే, టిఆర్ ఎస్‌కు రూ.40 కోట్లు, వైసీపీకి రూ.20కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ.27కోట్లు, శిరోమణీ అకాలీదళ్కు రూ.7 కోట్లు విరా ళాలు అందాయి.
2021-22లో వివిధ పార్టీలు అందుకున్న విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి..సమాజ్‌వాది పార్టీ రూ. 13.76 కోట్లు, తెలుగుదేశంపార్టీ రూ. 62.9 లక్షలు, వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూ. 80.01 కోట్లు, మహా రాష్ట్రవాది గోమంతక్ రూ. 1.86 కోట్లు, మహారాష్ట్ర నవ నిర్మా ణ సేన (ఎంఎన్‌ఎస్) రూ. 1.43 కోట్లు, జననాయక్ జనతా పార్టీ రూ. 5 లక్షలు, 13. జార్ఖండ్ ముక్తి మోర్చా రూ.1లక్ష, రాష్ట్రీయ లోక్ దళ్ రూ.50.76 లక్షలు, కేరళ కాంగ్రెస్ రూ.26.62 లక్షలు, గోవా ఫార్వర్డ్ పార్టీ రూ.25 లక్షలు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) రూ.7.3 లక్షలు. బీజెడీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ , ఏఐఏడీఎంకే ఒకే సంవ త్సరంలో రూ. 20,000 కంటే ఎక్కువ విరాళాలను ప్రకటించాయి.