ఈ దిండు అక్ష‌రాలా రూ.45 ల‌క్ష‌లు!

త‌ల‌కింద మంచి దిండు లేక‌పోతే నిద్ర‌ప‌ట్ట‌దు. దిండు మెత్త‌గా లేద‌ని గొడ‌వ‌ప‌డే పెద్ద‌వాళ్లూ వుంటారు. బూరుగుదూది దిండ్ల మీద మ‌న‌వాళ్ల‌కు మ‌హా వ్యామోహం. ఆ దిండు మీద త‌ల‌పెట్టుకుని అలా ప‌డుకోగా నే క్ష‌ణాల్లో మంచి నిద్ర‌లోకి జారిపోవ‌చ్చ‌న్న‌ది మంచి నిఖార్స‌యిన అభిప్రాయం. దిళ్ల‌లో అనేక ర‌కాలు చెబుతూంటారు. మ‌నం చేయించుకునేది, మ‌నం కొన్న‌ది కాస్తంత త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులోకి వ‌స్తుం ది. కానీ వాన్‌డెర్ గారి దిండు అసామాన్యం! ఎందుకంటే ఈ దిండు ఖ‌రీదు అక్ష‌రాలా 45 ల‌క్ష‌లు!  

ఇంత ఖ‌రీద‌యిన వ‌స్తువులు పూర్వం బ్రిటీష్ మ‌హారాణి గారే వాడేవారు. అది వారికే చెల్లింది సుమీ అనే వారు అప్ప‌ట్లో తాత‌య్య‌లు, అమ్మ‌మ్మ‌లు. కానీ ఈ రోజుల్లో 45 ల‌క్ష‌లు పెట్టి త‌యారుచేసుకున్న దిండు ప్ర‌త్యేక‌త ఏమిట‌న్న‌ది తెలుసుకోవ‌డానికి చాలామంది ఆయ‌న్ను క‌లిసేర‌ట‌. నిజంగా ఆయ‌న అంతపోసి త‌యారుచేసుకున్నాట్టండీ?! అంటే అవును అంటూ దాన్ని చూపించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచాడు వాన్ డెర్. 

థిజ్స్ వాన్ డెర్ హిల్స్ట్  అనే పెద్దాయ‌న   నిద్రలేమితో బాధపడేవారు ప్రశాంతంగా  నిద్రపోవడానికి ఈ దిండు సహాయపడుతుందన్నారు. డచ్ సర్వైకల్ స్పెషలిస్ట్-డిజైనర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండును త‌యారుచేశారు. మామూలుగా  వాడ‌డానికి సిద్ధంగా వుండే దిండు వుంటుంది. కానీ వాన్ ద‌గ్గ‌ర వున్న‌ది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అధునాతనమైన దిండు.  ఇది ఈజిప్ట్‌ పత్తి , మల్బరీ సిల్క్ తో తయారుచేశాడు.  అలాగే  విషరహిత డచ్ మెమరీ ఫోమ్‌తో నిండి  ఉంటుంది. ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ప్రకారం, నెదర్లాండ్స్‌కు చెందిన  వాన్ డెర్ హిల్స్ట్ ఈ దిండు త‌యారీకి  57,000 డాల‌ర్లు  (దాదాపు రూ.45 లక్షలు) వెచ్చించారు. 

వాన్ డెర్  ఈ ప్రత్యేకమైన దిండును త‌యారుచేయ‌డానికి పదిహేను సంవత్సరాలు పట్టింది. ఇది  24 క్యా రెట్ల బంగారం, వజ్రాలు,  నీలమణితో నిండి ఉంది. అంతేకాకుండా, దిండును నింపడానికి  ఉపయో గించే పత్తి  రోబోటిక్ మిల్లింగ్ యంత్రం నుండి వస్తుంది. దిండు 24-క్యారెట్ గోల్డ్ కవర్‌ను కలిగి ఉంది.  సురక్షిత మైన,  ఆరోగ్యకరమైన నిద్ర కోసం అన్ని విద్యుదయ స్కాంత వికిరణాలను నిరోధించే  ఒక  మెరుస్తున్న ఫాబ్రిక్ తొడుగు  ధర ట్యాగ్‌కు జోడించబ‌డింది.  ఇది   22.5 క్యారెట్ నీలమణి,  నాలుగు వజ్రాలను  కలిగి ఉన్న జిప్పర్.

హై-టెక్ సొల్యూషన్స్, పాత-కాలపు హస్తకళను కలపడం ద్వారా, టైలర్‌మేడ్  పిల్లో అత్యంత వినూత్నమై నది. ఈ దిండు బ్రాండెడ్ బాక్స్‌లో ప్యాక్ చేయబడింది.  హిల్స్ట్ నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు ప్రశాంతంగా నిద్రపోవడానికి దిండు సహాయపడుతుందని పేర్కొన్నారు.