పేలుళ్ల హెచ్చరికలతో ఉలిక్కిపడిన భాగ్యనగరం: అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు ముమ్మరం.!
Published on: Thu Nov 26, 2026 1:19PM
.webp)
హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భాగ్యనగరంలో 26/11 తరహాలో దాడులకు పాల్పడనున్నట్లుగా లష్కరే తోయిబా పేరుతో వచ్చిన హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరం అంతటా భద్రతను కట్టుదిట్టం చేసి.. కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు.
ఈ నెల 18న జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో లష్కరే కమాండర్ లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు ఉంటాయని నవంబర్ 21న పంపిన ఈమెయిల్‌లో అగంతకులు పేర్కొన్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజాలను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాణనష్టం కలిగేలా దాడులకు పాల్పడనున్నట్లు ఆ మెయిల్ లో పేర్కొన్నారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్‌లు రంగంలోకి దిగాయి. మెయిల్‌లో పేర్కొన్న ప్రదేశాలతో పాటు ఇతర రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో యాంటీ-సాబోటేజ్ తనిఖీలు నిర్వహించారు.

అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో పేలుళ్లు: బెదరింపు ఈ మెయిల్ తో పోలీసులు అలర్ట్.!
డిస్పోజబుల్ ఈమెయిల్ అడ్రస్, విదేశీ వీపీఎన్ సర్వర్ ఉపయోగించి ఈ మెయిల్ పంపినట్లు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇది ఎవరో ఆకతాయిల పని అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అయినా కూడా భద్రతాపరంగా ఎలాంటి అలసత్వం కూడదన్న భావనతో అప్రమత్తంగా ఉన్న పోలీసులు, ప్రశాంతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ణప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులు కనిపించినా, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న గమనించిన 112 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
మీకు నచ్చవచ్చు: లుఫ్తాన్సా ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్
పేలుళ్ళకు వాడిన బాంబులు ఇక్కడ చేసినవె
[Terror, Attacks, Threat, Emain, Laskareetoiba, Hyderabad, Kachiguda, TeluguOne]


