హైదరాబాద్ లో పేలుళ్లు: బెదరింపు ఈ మెయిల్ తో పోలీసులు అలర్ట్.!
Published on: Mon Nov 23, 2026 9:42AM

హైదరాబాద్లో పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ పోలీసులకు బెదిరింపు ఈ-మెయిల్ అందడం కలకలం రేపింది. ముంబై 26/11 ఉగ్రదాడి తరహాలోనే పేలుళ్లకు పాల్పడతామన్నది ఆ బెదరింపు ఈ మెయిల్ సారాంశం. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించడమే కాకుండా, నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా సహా భాగ్యనగరంలోని పలు ప్రముఖ ప్రాంతాలలో పేలుళ్లు జరుపుతామన్నది ఆ ఈమెయిల్ లో హెచ్చరించారు.
లష్కరేతోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, టాప్ కమాండర్ లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడతామని ఆ ఈమెయిల్ లో పేర్కొన్న నేపథ్యంలో... పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యింది. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, దీనిని పంపిన వారు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు సందేశం ప్రామాణికత, దాని వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను సేకరించడంపై దృష్టి సారించారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, హోటళ్లు, ప్రజలు అధికంగా సంచరించే ప్రదేశాల్లో నిఘా కట్టుదిట్టం చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన వస్తువులు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు సిబ్బందికి ఆదేశాల్లో స్పష్టం చేశారు. అలాగే ఇతర భద్రతా విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నగరంలో భద్రతా పరమైన అప్రమత్తతను కొనసాగిస్తూనే తనిఖీలను వేగవంతం చేశారు.
ఇది కూడా చదవండి: లుఫ్తాన్సా ఎయిర్‌వేస్ విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్
బెదిరింపు మెయిల్‌కు సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మెయిల్ పంపించింది ఎవరు? ఎక్కడ నుంచి వచ్చింది? అన్న వివరాలపై దృష్టి సారించారు. మెయిల్ మూలాలు నిర్ధారణ అయితే ఆ ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

మరోవైపు.. నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే, వాటికి దూరంగా జరిగి పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రదేశాలలో మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు.
మీకు నచ్చవచ్చ: టాయిలెట్‌లో ఓ కాగితం..గాల్లోనే ప్రయాణికులకు బాంబు టెన్షన్.!
పేలుళ్ళకు వాడిన బాంబులు ఇక్కడ చేసినవె
[Bombthreat, Email, Hyderabad, Police, HIAlert, TeluguOne]


