అంగరంగ వైభవంగా తెలుగు వన్ రజతోత్సవ వేడుకలు

పాతిక వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగువన్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రజతోత్సవ  సభకు నిండుదనం తెచ్చారు. పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి మహా విశిష్ట అతిథిగా హాజరై తెలుగువన్ టీమ్‌ని ఆశీర్వదించారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి  నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె,  స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. 

కార్యక్రమంలో పది మంది ప్రముఖులను తెలుగువన్ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సన్నానించారు సహస్రావధాని మేడసాని మోహన్, ప్రజావైద్యులు  డాక్టర్ పాములపర్తి రామారావు, తెలుగు మీడియా అకాడమీ చైర్మన్ కల్మెకొలను శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ గ్రహీత్ చంద్రబోస్, రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నతాధికారి డాక్టర్ పి.వి.రమేష్, వ్యవసాయ నిపుణుడు ముళ్లగూరు అనంతరాముడు, నీలోఫర్ కేఫ్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావు, సీఎస్ బీ, ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు మల్లవరపు బాలలత,  స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్‌లను  తెలుగువన్ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సన్మానించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu