అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా
posted on Aug 4, 2025 2:22PM

తెలంగాణ శాసన సభ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. సభాపతి గడ్డం ప్రసాద్‌ను కలవడానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం శాసనసభ కార్యాలయానికి వెళ్లింది. అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. పార్టీ ఫిరాయింపుల శాసన సభ్యులను డిస్‌క్వాలిఫై చేయాలని నినానాదాలు చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ధర్నాను కవర్ చేయకుండా మీడియాను పోలీసులు అడ్డుకున్నారు. శాసనసభ ఆవరణలో మీడియా ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. మీడియా ప్రతినిధులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.