కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు-1

 

తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం బుధవారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఆ వివరాలు.. 1. అమర వీరులకు కుటుంబాలకు 10 లక్షల రూపాయిల పరిహారం. అమరవీరుల పిల్లలకు ఉచిత విద్య, అర్హులైన వారికి ఉద్యోగం. 2. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి పథకం, 50 వేల రూపాయల ఆర్థిక సాయం, 3. నిరుపేద దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ, 4. తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు, 5. ఎస్టీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్పై కమిటీలు, 6. తెలంగాణ ఎన్ఆర్ఐలకు కేరళ తరహా సంక్షేమ బోర్డు, 7. వృద్ధులు, వితంతువులకు వెయ్యి రూపాయిల పింఛన్, 8. 2011 నుంచి తెలంగాణ ఉద్యమ కారులపై ఉన్న కేసుల ఎత్తివేత, 9. 1956కు ముందు తెలంగాణలో స్థిరపడ్డ వారికే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తింపు, 10. వ్యవసాయ యూనివర్సీటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, 11. అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్.