కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు-2

 

తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం బుధవారం జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఆ వివరాలు.. 1. 43 అంశాలపై చర్చ, పలు ఎన్నికల హామీలకు ఆమోదం, 2. లక్షలోపు రుణాల మాఫీతో సర్కారుపై రూ. 19 వేల కోట్ల భారం, 3. బంగారంపై రుణాలు, పాత బకాయిలకూ వర్తింపు, 4. 39 లక్షల మంది రైతులకు లబ్ధి, త్వరలో ఆర్థిక శాఖ మార్గదర్శకాలు, 5. అన్ని శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ.. 40 వేల మందికి వరం, 6. విద్యార్థులకు ఆర్థిక సాయానికి 1956 ప్రామాణికత, 7. దళిత, గిరిజన వధువులకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 50 వేల సాయం, 8. అమర వీరుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, ఇల్లు, భూమి, ఒకరికి ఉద్యోగం, 9. తెలంగాణ ఇంక్రిమెంట్‌కు ఓకే, కేంద్ర స్థాయిలో వేతనాలకు కమిటీ, 10. ఎస్టీలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ల అమలు, 11. ఆటోలు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు.