కిషన్ రెడ్డిని లైట్ తీసుకుంటున్న బిజెపి

 Telangana decision BJP, telangana bill, kishan reddy, ap assembly, telangana issue, 2014 elections

 

రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకి మద్దతిస్తామని మొదటి నుంచి చెబుతున్న బిజెపి పునరాలోచన చేస్తుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే విషయమై ఇటీవల కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపి౦చిన బిజెపి అధిష్టానం దీనిపై సుదీర్ఘ౦గా చర్చించిన తరువాత తెలంగాణ బిల్లుకు మద్దతిస్తే కాంగ్రెస్ కి తప్ప బిజెపికి ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నట్టు సమాచారం.

 

ఈ సంధర్బంగా తెలంగాణలో ఎన్నిసీట్లు వస్తాయని ఆరా తీయగా కిషన్ రెడ్డి చెప్పిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన బిజెపి అధిష్టానం కిషన్ రెడ్డి నోటి పవర్ని కాస్త తగ్గించమని ఆదేశాలు జారీ చేశారట. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు ఇస్తే తెలంగాణకి ఏకపక్షంగా మద్దతు ప్రకటించి మొత్తం రాష్ట్రంలోనే బీజేపీ దుకాణం సర్దేసే పరిస్థితి తెచ్చావని అధిష్టానం అన్నట్లు తన సన్నిహితుల వద్ద కిషన్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారట.  దీంతో తెలంగాణ బిల్లుకి బిజెపి మద్దతు డౌటేనని అంటున్నారు రాజకీయ నిపుణులు.