వచ్చే ఏడాది ఆర్ధిక బడ్జెట్ అయినా తెలంగాణ ప్రభుత్వం చేరుకోగలదా...

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఈ ఏడాది కూడా సవరించిన అంచనాలను చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కారణంగా మొదట ఒటాన్ అకౌంట్ బడ్జెట్ ఆ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం కారణంగా 1,46,000 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రకటించారు. ఇది అంతకుముందు ఏడాది అంచనాల కంటే 35000 కోట్లు తక్కువే. అయితే, సవరించిన అంచనాలను కూడా ఇప్పుడు చేరుకోలేని పరిస్థితి ఉన్నట్లు సమాచారం.సవరించిన అంచనాలలో 10,000 కోట్లను భూముల అమ్మకం సమకూర్చుకుంటామని తెలిపారు. కానీ సాంకేతిక కారణాలతో ఒక్క ఎకరం భూమి కూడా అమ్మలేకపోయారు. దీంతో అంచనాలు చేరుకోవడం కష్టమేనని అంటున్నారు.భూముల అమ్మకం కాకుండా ఇతర ఆదాయ మార్గాల లోనూ కోత పెడుతోంది. జీఎస్టీ తో వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది మద్యం షాపుల దరఖాస్తుల వేలం ద్వారా సుమారు 10,000 కోట్ల సమకూరాయి. 

మద్యం ధరల పెంపకం మద్యం షాపుల టెండర్ల వల్ల కూడా ఆదాయం ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. రవాణా రిజిస్ర్టేషన్ల శాఖ ఆదాయం కూడా లాభసాటి గానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయన జీఎస్టీ భారీగా పడిపోవటం వల్ల అంచనాలను చేరుకునే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు.ఫిబ్రవరి 3డవ వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ సారైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ అంచనాల్లో రూపొందించాలని భావిస్తున్నారు. అన్ని శాఖల ప్రతిపాదనలు ఆర్థిక శాఖ చేరాయి. దీని పై మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్ బడ్జెట్ రూపకల్పనపై సమీక్ష చేసే అవకాశముంది.ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో గత ఏడాది అంచనాలూ చేరుకోలేకపోయారు దీంతో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు పంపాల ని సూచించినట్టు తెలిసింది ఆర్థిక మాంద్యం ప్రభావం కొత్త ఆర్థిక సంవత్సరం లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అయితే గత ఏడాది కంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.2020-2021 బడ్జెట్ లో పన్నుల మోత పడే అవకాశముంది. పన్నులు పెంచి ఆర్థిక మాంద్యం వల్ల ఏర్పడ్డ లోటును పూడ్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే మద్యం ధరలను భారీగా పెంచారు. అన్ని రకాల ఎన్నికలు ముగిసినందున అవకాశం ఉన్న చోట అల్లా పన్నుల బాదే అవకాశముంది. భూముల మార్కెట్ విలువలను సవరించి రిజిస్ర్టేషన్ల ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. విద్యుత్ చార్జీలు కూడా పెంచి ఆ శాఖకు అందించే సహాయాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.ఈ ఏడాది ఎంత మేరా తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక బడ్జట్ ను చేరుకోగలుగుతుందో వేచి చూడాలి.