నేటి నుంచే విభజన చర్చ

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లుపై చర్చకు ముహుర్తం కుదిరింది. శాసన సభతో పాటు శాసన మండలిలో కూడా ఈ రోజునుంచి కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లుపై నేతలు చర్చించనున్నారు. మంగళవారం జరిగిన బిఏసి సమావేశంలో అన్నిపార్టీల నేతలు ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు.సభలో చర్చకు సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటిస్తారు.

రాష్ట్రపతి ఇచ్చిన గడువు జనవరి 23తో ముగుస్తుండటంతో ఈ లోపు మూడు విడతలుగా చర్చించటానికి నిర్ణయించుకున్న్టుగా సమాచారం. నేడు ప్రారంభించిన మూడురోజుల పాటు తొలివిడతగా చర్చించనున్నారు. ఆ తరువాత క్రిస్‌మస్‌తో పాటు కొత్త సంవత్సర సెలవు తరువాత జనవరి 3 నుంచి పదో తేది వరకు రెండో విడత సభలో చర్చిస్తారు.

చివరిసారిగా జనవరి 16న ప్రారంభించి 23తో చర్చను ముగించి బిల్లును తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి పంపాలని ప్రాధమిక నిర్ణయించారు. మంగళ వారం స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ చాంబర్‌లో జరిగిన బిఏసి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్‌లో రాష్ట్రంలోని ప్రదాన పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు.